‘మురసు’ నష్టం రూ.2,484.43 కోట్లు | Chandrababu Naidu briefs central team about damage caused by cyclone Murasu | Sakshi
Sakshi News home page

‘మురసు’ నష్టం రూ.2,484.43 కోట్లు

Nov 16 2026 3:23 AM | Updated on Nov 16 2026 3:23 AM

Chandrababu Naidu briefs central team about damage caused by cyclone Murasu

కేంద్ర బృందానికి వివరించిన సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ఒకేసారి రెండు తుపాన్లు రావడంతో రాష్ట్రానికి భారీ నష్టం కలిగిందని, మురసు తుపాను వల్ల దాదాపు రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి తెలిపారు. తుపాను నష్టాల్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోమ్‌ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌ దాస్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఆదివారం పర్చువల్‌గా సీఎంతో భేటీ అయ్యింది. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తుపాను నష్టాన్ని తగ్గించేలా శాశ్వత పరిష్కారంగా మౌలిక వసతులు మరింత దృఢంగా నిర్మించాల్సి ఉందని, దీనికి కేంద్ర సాయం కావాలని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 10 రోజుల్లో తుపాను నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని బృందాన్ని కోరారు. పంట నష్టపోయిన రైతులకు బీమా సాయం త్వరగా అందేలా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రహదారులకు భారీ నష్టం జరిగిందని, ముఖ్యంగా ఫ్లాష్‌ ఫ్లడ్‌లతో గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడాన్ని గమనించామని కేంద్ర బృందం తెలిపింది. 

పత్తి వంటి వాణిజ్య పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు బీమా చేసుకోలేదని పేర్కొంది. గిరిజనులపైనా తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, వారిని ప్రత్యేకంగా ఆదుకోవాల్సి ఉందని తెలిపింది. వరి పంటకు తూర్పు గోదావరి జిల్లాలో 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకు నష్టం వాటిల్లిందని, హార్టికల్చర్‌ పంటల్లో మామిడి, బొప్పాయి పంటలు ఎక్కవ దెబ్బతిన్నాయని కేంద్ర బృందం వివరించింది. కాగా.. మురసు వల్ల దాదాపు రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ అంచనాలతో నివేదిక సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement