విదేశాల నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు మాజీ పీఎస్‌ | Chandrababu Former Ps Srinivas Has Returned From America | Sakshi
Sakshi News home page

విదేశాల నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు మాజీ పీఎస్‌

Jun 19 2024 3:08 PM | Updated on Jun 19 2024 4:14 PM

Chandrababu Former Ps Srinivas Has Returned From America

స్కిల్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ విదేశాల నుంచి తిరిగొచ్చారు.

సాక్షి, విజయవాడ: స్కిల్ స్కామ్ విచారణ సమయంలో అమెరికా వెళ్లిపోయిన చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ విదేశాల నుంచి తిరిగొచ్చారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు అనంతరం తిరిగి వచ్చిన శ్రీనివాస్.. తనపై సస్పెన్షన్‌ ఎత్తివేసి తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యూల శ్రీనివాస్‌కు 2023 సెప్టెంబర్‌లో స్కిల్ స్కాం కేసులో సీఐడీ నోటీసులు జారీ చేసింది.

మనీ లాండరింగ్‌పై ప్రశ్నించేందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన కానీ.. తీసుకోకుండా పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్లిపోయారు. గత ఏడాది సెప్టెంబరు 6న అమెరికాకు పరారయ్యారు. దీంతో శ్రీనివాస్‌ను సెప్టెంబరు 30న గత ప్రభుత్వం సస్పెండ్‌ర చేసింది. 2020 ఫిబ్రవరి 6న పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లోనూ, పలు కంపెనీల్లో ఐటి సోదాలు జరిగాయి. ఆ సోదాల్లో రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు ఐటీ శాఖ అధికారులు ప్రకటించారు.

చంద్రబాబు Ex-Ps సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని దరఖాస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement