నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్‌!

Case Filed Against Man Who Cheated Minor Girl And Getting Pregnant - Sakshi

యువకుడిపై కేసు నమోదు

సాక్షి, కైకలూరు: కాళ్లపాలెం పంచాయతీ శివారు చింతలమూరుకి చెందిన దళిత మైనర్‌ బాలిక(17)ను సానారుద్రవరానికి చెందిన గంగుల జగదీష్‌(22) అనే యువకుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భవతిని చేశాడని పోలీసులు తెలిపారు. ఎస్సీకి చెందిన నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు అంటూ జగదీష్‌ ఇప్పుడు నిరాకరిస్తున్నాడని బాలిక తల్లి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఎస్‌ఐ జనార్థన్‌ ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని, డీఎస్పీ సత్యానందం కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.   

చదవండి: బాకీ తీర్చమన్నందుకు తల్లి, కుమారుడి హత్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top