విశాఖ, సాక్షి: గాజువాక వికాస్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. జాకీతో బిల్డింగ్ లిఫ్ట్ చేస్తుండగా భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.


