విశాఖలో భూ ఆక్రమణలు: బొత్స సత్యనారాయణ | Botsa Satyanarayana on Visakhapatnam Land Grabs | Sakshi
Sakshi News home page

విశాఖలో భూ ఆక్రమణలు: బొత్స సత్యనారాయణ

Mar 18 2026 4:41 PM | Updated on Mar 18 2026 4:47 PM

Botsa Satyanarayana on Visakhapatnam Land Grabs

విశాఖ: కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విశాఖను దోచుకు తింటున్నారని తెలిపారు. ఉద్యమ కార్యచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీతో ఉన్న కార్పొరేటర్లకు సాధ్యమైనంత వరకు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement