వాటి అమలులో ఏపీ దేశంలోనే ముందుంది: మంత్రి బొత్స

Botsa satyanarayana comments at seminar on new education system - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై గురువారం విజయవాడలో సెమినార్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు శిక్షణ కోసం నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌తో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

సెమినార్‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ.. 'కళాశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఉండాలనే స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్ ఫోలియో కూడా పెట్టాం. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఏపీ దేశంలోనే ముందుంది. ఏపీ నుంచి వచ్చిన విద్యార్ధులు గ్లోబల్ స్టూడెంట్ అనిపించుకోవడం ముఖ్యం. అందుకే ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టాం. లక్ష మందికి పైగా విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పైసా ఖర్చు సంక్షేమం కోసమే కాదు పెట్టుబడి. దానిని వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి' అని మంత్రి బొత్స ఆకాంక్షించారు. 

చదవండి: (అక్కడ ఈడ్చి తంతే హైదరాబాద్‌లో పడ్డాడు: మంత్రి ఆర్కే రోజా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top