
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన సైకో పార్టీలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ సైకో చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిసున్నారని మండిపడ్డారు.
ఈమేరకు మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు.. శవాల నాయుడు. కుప్పంలో ఆయన కూసాలు కదులుతున్నాయి. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాద్‌లో పడ్డాడు. పవన్‌ను సొంత జిల్లా, నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు. చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడు. కందుకూరులో ఎనిమిది, గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్‌కు కనపడలేదా?. పవన్ కల్యాణ్‌కు ప్రజలే రాజకీయ సమాధి కడతారు' అని మంత్రి రోజా హెచ్చరించారు.
చదవండి: (చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే: ఎంపీ నందిగం సురేష్)