AP: రాష్ట్రానికి 8న అమిత్‌ షా, 10న నడ్డా రాక

BJP Leaders Amit Shah And JP Nadda Are Coming To AP - Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీ అగ్రనేతలు  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఇద్దరూ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా మే 30వ తేదీ నుంచి  జూన్‌ 30వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్ర­మాలు నిర్వహిస్తోంది. 

ఈ కార్య­క్రమాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవ తేదీన తిరుపతికి వస్తా­రని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిలో రెండు చోట్ల భారీ బహిరంగ సభల నిర్వహణకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. 

ఇది కూడా చదవండి: ఇదిగో గ్రామ స్వరాజ్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top