అనపర్తిలో అయోమయం | Sakshi
Sakshi News home page

అనపర్తిలో అయోమయం

Published Thu, Apr 25 2024 3:25 PM

అనపర్తి బీజేపీ అభ్యరి్థ శివరామ కృష్ణంరాజు తరఫున సోమవారం నామినేషన్‌ వేస్తున్న ఆయన భార్య దుర్గా దేవిక

భార్యతో తన నామినేషన్‌ వేసిన బీజేపీ అభ్యర్థి కృష్ణంరాజు

ఆయనను తప్పించేందుకుపురందేశ్వరి యత్నాలు

నామినేషన్‌ వేయవద్దని వార్నింగ్‌!

తన విజయం కోసం ఆ సీటు నల్లమిల్లికి కట్టబెట్టేందుకు వ్యూహం

బీజేపీ పేరుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి సతీమణి నామినేషన్‌

నేడో రేపో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 

సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్‌ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. 


 
చంద్రబాబు వ్యూహంతో.. 
అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు.
 
పోటాపోటీగా నామినేషన్లు 
నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్‌ దాఖలు చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్‌రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్‌ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్‌ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బీజేపీ గూటికి నల్లమిల్లి? 
తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్‌లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్‌ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్‌ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది.
 
సెంటిమెంటుతోనేనా.. 
అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్‌ పోటీ చేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. 

నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! 
రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్‌ దాఖలు చేయించారని తెలిసింది. 

మాజీ సైనికుడికి అన్యాయం? 
అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్‌గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లో లోక్‌సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్‌ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. 

Advertisement
Advertisement