తుర్కియే, సిరియాల్లోని తెలుగువారిని ఆదుకోండి | Appeal of YSRCP MPs to Central Govt | Sakshi
Sakshi News home page

తుర్కియే, సిరియాల్లోని తెలుగువారిని ఆదుకోండి

Feb 9 2023 5:08 AM | Updated on Feb 9 2023 5:08 AM

Appeal of YSRCP MPs to Central Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాల్లో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకోవాలని కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖకు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఎన్‌.రెడ్డెప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాకు తెలిపారు. ఎంపీలు చంద్రశేఖర్, రంగయ్య మాట్లాడుతూ.. తుర్కియే, సిరియాల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన వెయ్యిమంది తెలుగువారిని రక్షించాలని కోరామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదలకు సాయం చేయనివ్వకుండా కోర్టులకు వెళ్తున్నారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డిలాగే చంద్రబాబు కూడా రాజకీయాల్లో భూస్థాపితం అవుతారన్నారు. ఓటుకు కోట్లు కేసుతో రాత్రికిరాత్రి విజయవాడ పారిపోయి వచ్చారన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement