నా కుమారుడి అరెస్ట్‌ అక్రమం: మాజీ మంత్రి విశ్వరూప్‌ | AP Police Arrest Ex Minister Pinipe Vishwaroop's Son | Sakshi
Sakshi News home page

నా కుమారుడి అరెస్ట్‌ అక్రమం: మాజీ మంత్రి విశ్వరూప్‌

Oct 21 2024 8:34 AM | Updated on Oct 21 2024 11:29 AM

AP Police Arrest Ex Minister Pinipe Vishwaroop's Son

సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు మాజీ మంత్రి పినేపి విశ్వరూప్‌. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్‌ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి విశ్వరూప్‌ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే నా కుమారుడిని హత్య కేసులో ఇరికించారు. హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఎఫ్‌ఐఆర్‌లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారు. రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్టు చేశారు అని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement