‘హోటల్‌ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి’ | AP Govt Effort To Develop Hotel Sector Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

‘హోటల్‌ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

Jul 6 2023 4:51 PM | Updated on Jul 6 2023 4:57 PM

AP Govt Effort To Develop Hotel Sector Botsa Satyanarayana - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో హెటల్‌ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెటల్‌ రంగాన్నిఇండస్ట్రియల్‌ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి బొత్స.. చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుపడాలి. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూదన్నదే మా ప్రభుత్వ ఉద్ధేశం.

హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తాం. హోటల్స్ లో భోజనం క్యాలిటీగా ఇవ్వాలి.క్వాలిటీగా ఇస్తే ప్రజలు అక్కడికే వస్తారు. ఏ రంగంలో నైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలి.సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం’ అని తెలిపారు.

ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్‌వి స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బొత్సతో పాటు మంత్రి జోగి రమేస్‌, తూర్పు నియోజకవర​ ఇంచార్జి దేవినేని అవినాష్‌లు హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement