breaking news
Hotel sector
-
‘హోటల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో హెటల్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెటల్ రంగాన్నిఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి బొత్స.. చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుపడాలి. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూదన్నదే మా ప్రభుత్వ ఉద్ధేశం. హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తాం. హోటల్స్ లో భోజనం క్యాలిటీగా ఇవ్వాలి.క్వాలిటీగా ఇస్తే ప్రజలు అక్కడికే వస్తారు. ఏ రంగంలో నైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలి.సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం’ అని తెలిపారు. ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్వి స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బొత్సతో పాటు మంత్రి జోగి రమేస్, తూర్పు నియోజకవర ఇంచార్జి దేవినేని అవినాష్‌లు హాజరయ్యారు. -
కొత్త ‘ఆతిథ్యం’
హుడా కాంప్లెక్స్: అతిథ్య రంగం ట్రెండ్ మారుతోంది.. కాలానుగుణంగా వినియోగదారుల అభి‘రుచుల’ మేరకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆయా రంగంల్లోనూ పెను మార్పులు తీసుకువచ్చింది. ఆతిథ్యరంగంలో ఇప్పటివరకు అతిథులకు ఆహ్వానం పలికిన ఎగ్జిక్యూటివ్‌లు, ఆర్డర్ తీసుకొని ఆహార పదార్థాలను సరఫరా చేసే స్థానంలో ప్రస్తుతం రోబోలు రంగ ప్రవేశం చేశాయి. సాధారణ వెయిటర్ చేసే పనులను అలవోకగా చేస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లోనే లభిస్తున్న వీటి సేవలు మన వద్దకూ వచ్చాయి. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగించడంతో పాటు.. అవి వడ్డించే రోబోలను ఆసక్తిగా తిలకిం చేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవిడ్‌కు దూరంగా.. వినూత్నంగా కోవిడ్ ఉధృతికి తోడు వరుస లాక్డౌన్లతో ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా ఆతిథ్య రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. మరోవైపు పుట్టినరోజు.. పెళ్లి రోజు.. ఇతర శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి కడుపు నిండా తిందామని భావించిన వారు కోవిడ్‌కు భయపడి వీటికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వినూత్నంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్ గౌడ్. అలా రోబోలతో కొత్తగా రెస్టారెంట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆర్డర్ మొదలు.. సప్లయ్ వరకు హోటల్‌కు వచ్చిన అతిథులకు కోవిడ్ సోకకుండా ఉండేందుకు సాధారణ మనుషుల స్థానంలో రోబోలను తీసుకువచ్చాడు. ఈ మేరకు కొత్తపేట్‌లో కొత్తగా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలు పని చేస్తున్నాయి. వచ్చిన అతిథుల నుంచి ఆర్డర్ తీసుకోవడం.. ఆర్డర్‌ను చెఫ్‌కు అందజేయడం.. ఆహార పదార్థాలు సిద్ధం కాగానే వాటిని అతిథులకు వడ్డించడం.. తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లడం.. శుభ్రం చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం లాంటి పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. మరోరోబో వచ్చి గెస్టులతో ముచ్చటిస్తుంది. వారికి బోరు కొట్టకుండా ఇష్టమైన సంగీతం, సాహిత్యం వినిపిస్తూ అమితంగా ఆకట్టుకుంటోంది. నగరంలోనే తయారీ 2019లో మాదాపూర్‌లో ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశా. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ఓ హైస్కూల్‌కు ఎడ్యుకేషన్ రోబోను ఇచ్చాం. ఇటీవల కొత్తపేట్‌లోని హోటల్‌కు రోబోలను సరఫరా చేశాం. తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వైజాగ్, అహ్మదాబాద్, పుణే నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ రంగంలోను రోబోలను ప్రవేశ పెట్టబోతున్నాం. వీటి ధర రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. – రామ్సింగం, సీఈఓ, ప్రైవేట్ లిమిటెడ్ రోబోలతో మంచి ఆదరణ నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా రెస్టారెంట్ తెరవాలని భావించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండడంతో రోబోల తయారీ, పనితీరుపై అవగాహన ఉండటం కలిసి వచ్చింది. అలా రోబోలతో సరికొత్తగా రెస్టారెంట్‌ను మార్చేశాం. వీటిని చూసేందుకు చాలామంది వస్తున్నారు. కస్టమర్లు పెరిగారు. ఆదరణ చాలా బాగుంది. – మణికాంత్‌గౌడ్, రెస్టారెంట్ యజమాని, కొత్తపేట నైస్ థ్రిల్లింగ్ ఏదైనా తిందామని కుటుంబసభ్యులతో కలిసి కొత్తపేటలోని రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ రోబోలను చూసి ఆశ్చర్యపోయాం. ఆర్డర్ తీసుకోవడం, సప్లయ్ చేయడం అచ్చం మనిషిలాగే చేస్తున్నాయి. నైస్ థ్రిల్లింగ్. వాటిని చూస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ.. నచ్చింది తింటూ ఎంజాయ్ చేశాం. – రాజ్యలక్ష్మి, ఎల్బీనగర్ -
జీఎస్టీతో హోటల్ రంగం కుదేలే..
తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఆందోళన సాక్షి, హైదరాబాద్: కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న, మధ్యతరహా హోటళ్లకు పెనుభారం తప్పదని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని నాన్ ఏసీ హోటళ్లపై 12%, ఏసీ రెస్టారెంట్లపై 18%, స్టార్ హోటళ్లపై 28 % వడ్డించడంతో పలు హోటళ్లను మూసేయాల్సిన దుస్థితి తలెత్తుతోందని చెబుతు న్నారు. జీఎస్టీ రేటును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్స్ అసోసియేషన్ ఈ నెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో బంద్‌కు మద్దతిచ్చే అంశంపై తెలం గాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చిన్న, మధ్యతరహా ఏసీ రెస్టారెంట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. తాజా పన్ను విధానంతో పలు హోటళ్లు మూతపడే పరిస్థితిని రానుందని, దీంతో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు.