జీఎస్‌టీతో హోటల్‌ రంగం కుదేలే.. | Hotel sector will fell down with GST .. | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీతో హోటల్‌ రంగం కుదేలే..

May 22 2017 3:11 AM | Updated on Sep 5 2017 11:40 AM

కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)తో రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న, మధ్యతరహా హోటళ్లకు పెనుభారం తప్పదని

తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)తో రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న, మధ్యతరహా హోటళ్లకు పెనుభారం తప్పదని తెలంగాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్‌టీని నాన్‌ ఏసీ హోటళ్లపై 12%, ఏసీ రెస్టారెంట్లపై 18%, స్టార్‌ హోటళ్లపై 28 % వడ్డించడంతో పలు హోటళ్లను మూసేయాల్సిన దుస్థితి తలెత్తుతోందని చెబుతు న్నారు. జీఎస్‌టీ రేటును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్స్‌ అసోసియేషన్‌ ఈ నెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది.

రాష్ట్రంలో బంద్‌కు మద్దతిచ్చే అంశంపై తెలం గాణ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎస్‌.వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చిన్న, మధ్యతరహా ఏసీ రెస్టారెంట్లపై జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. తాజా పన్ను విధానంతో పలు హోటళ్లు మూతపడే పరిస్థితిని రానుందని, దీంతో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement