Corona Virus: ఏపీలో కొత్తగా 1,601  కరోనా కేసులు | AP Government Released The Bulletin On Corona Virus | Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,601  కరోనా కేసులు

Aug 25 2021 5:38 PM | Updated on Oct 28 2021 7:02 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,766 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,201 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,78,364 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,061 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,06,191 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,62,70,356  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: దేశంలో కొత్తగా 37,593 క‌రోనా కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement