ఏపీ రైతుసంఘం డిమాండ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
