
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అధికారుల భేటీ ముగిసింది. ఎస్‌ఈసీతో గంటన్నరపాటు సీఎస్ బృందం సమావేశం కొనసాగింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ బృందం తెలిపింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. (చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి)
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని సీఎస్ బృందం పేర్కొంది. కేంద్రం సూచనలతో ఇవాళ కూడా డ్రైరన్ నిర్వహించామన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని, 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్‌కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్ బృందం తెలిపింది. రాష్ట్రంలోని యంత్రాంగమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉందని.. వాలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్ తెలిపారు.(చదవండి: మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు)