ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. సీఆర్డీఏ పరిధి పేదలకు ఇక డబుల్‌ పెన్షన్‌

AP CM YS Jagan Govt Increase Double Pension To CRDA Poor People - Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్‌డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్‌ రెట్టింపు చేస్తూ  తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  పెంచిన పెన్షన్‌ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది.

సీఆర్‌డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్‌ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top