చంద్రబాబుకు ఏడుపు ఆగటం లేదు | Anil Kumar Yadav Slams On Chandrababu Over House On Krishna River Bank | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఏడుపు ఆగటం లేదు

Oct 17 2020 10:21 AM | Updated on Oct 17 2020 2:15 PM

Anil Kumar Yadav Slams On Chandrababu Over House On Krishna River Bank - Sakshi

సాక్షి, నెల్లూరు: వరదలు వచ్చి కరకట్ట మీద ఇల్లు మునుగుతుంటే.. ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటాననడం సిగ్గుచేటని మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వర్షాలతో సుభిక్షంగా ఉంటే చంద్రబాబుకి ఏడుపు ఆగటం లేదన్నారు. కరకట్ట మీద ఉన్న ఇల్లు గురించి ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మొండికేస్తూ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక టూరిస్ట్ అని.. టూరిస్ట్‌లా ఏపీకి వచ్చి సాయంత్రానికి ఫ్లైట్ ఎక్కి పోయే ప్రతి పక్షనేతని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. చదవండి: అజ్ఞాతంలోకి చంద్రబాబు

బీసీల మీద మళ్లీ బాబుకి దొంగప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలో ఉంటే బీసీలు బిజినెస్క్లాస్‌ అని, ప్రతిపక్షంలో ఉంటే బ్యాక్వర్డ్క్లాస్ అంటారని.. ఆయనకు దమ్ముంటే బీసీలకు ఏం చేశాడో లెక్క తీయాలన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశాక, బీసీలకు ఎన్ని సంక్షేమ పధకాలు చేపట్టారో తాము చెబుతామని పేర్కొన్నారు.  బీసీల గురించి బాబు మాట్లాడం సిగ్గు చేటని, పచ్చ పత్రికలలో పిచ్చి రాతలు రాయించుకోవడం తప్ప బాబు మళ్లీ అధికారంలోకి రావడం కలని తెలిపారు. చదవండి: (కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement