కన్నవారింటికి పరామర్శకు వెళ్తూ.. ప్రమాదాన్ని గ్రహించలేక.. | Andhrapradesh: Lady Deceased In Road Accident Rajam | Sakshi
Sakshi News home page

కన్నవారింటికి పరామర్శకు వెళ్తూ.. ప్రమాదాన్ని గ్రహించలేక..

Aug 12 2021 10:30 AM | Updated on Aug 12 2021 10:46 AM

Andhrapradesh: Lady Deceased In Road Accident Rajam - Sakshi

సాక్షి, రాజాం సిటీ( శ్రీకాకుళం): కన్నవారింటికి పరామర్శ కోసం వెళ్లిన మహిళ రోడ్డు ప్రమాదానికి గురై ఊపిరి వదిలారు. ఈ ఘటన రాజాం మండలం శ్యాంపురం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం బొద్దూరు గ్రామానికి చెందిన వావిలపల్లి అప్పయ్యమ్మ (38) రాజాం మండలం లక్ష్మీపురం గ్రామంలోని తన వదిన ఈశ్వరమ్మను పరామర్శించేందుకు బయల్దేరారు.

రాజాం నుంచి శ్యాంపురం మీదుగా లక్ష్మీపురం చేరుకునేందుకు రాజాంలోని చిన్నచెరువు గట్టు వద్ద వాహనం కోసం వేచి చూస్తుండగా.. శ్యాంపురం గ్రామానికి చెందిన ఉంగటి ఆదినారాయణ బైక్‌పై కనిపించారు. ఆయనను లిఫ్టు అడిగి వెళ్లారు. వీరు బండిపై వెళ్తుండగా శ్యాంపురం సమీపంలో సారథి గెడ్డ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. అప్పయ్యమ్మకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదినారాయణకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని రాజాం కేర్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌ రిఫర్‌ చేశారు. మృతు రాలికి భర్త ఈశ్వరరావుతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపారు. అప్పయ్యమ్మ మృతిచెందడంతో ఇటు లక్షి్మపురంతోపాటు అటు సంతకవిటి మండలం బొద్దూరు గ్రామంలోనూ విషాదం నెలకొంది.      

Advertisement
 
Advertisement
Advertisement