అగ్రిగోల్డ్‌ బాధితుల నమోదు గడువు పొడిగింపు | 1 Day Time Extension Agrigold victims Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల నమోదు గడువు పొడిగింపు

Aug 18 2021 3:33 PM | Updated on Aug 18 2021 3:33 PM

1 Day Time Extension Agrigold victims Andhra Pradesh - Sakshi

సాక్షి,అమరావతి: అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్‌ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement