కన్వేయర్‌ బెల్ట్‌లో పడి కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కన్వేయర్‌ బెల్ట్‌లో పడి కార్మికుడి మృతి

Nov 15 2026 1:38 PM | Updated on Nov 15 2026 1:38 PM

● కర్ణాటకలోని కేపీసీఎల్‌ పవర్‌ప్లాంట్‌లో ఘటన

బొమ్మనహాళ్‌: ప్రమాదవశాత్తూ కన్వేయర్‌ బెల్టులో పడి ఓ యువ కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కుడితిని గ్రామ సమీపంలోని కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేపీసీఎల్‌) కర్మాగారంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన మేరకు.. మండలంలోని నేమకల్లుకు చెందిన కురుబ బసవరాజు (24) కేపీసీఎల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఆరు నెలలుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్లాంట్‌లోని కన్వల్ట్‌ బెల్టు వద్ద పనిచేస్తుండగా ప్రమాదశాత్తూ కన్వర్ట్‌ బెల్ట్‌లో పడటంతో తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య జయలక్ష్మి, ఏడు నెలల కొడుకు ఉన్నాడు. చిన్న వయస్సులోనే భర్తను కొల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పసిబిడ్డ పరిస్థితి పలువురిని కలచివేసింది.

రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆందోళన

కన్వర్ట్‌ బెల్టులో పడి మృతి చెందిన కురుబ బసవరాజు కుటుంబ సభ్యులు, నేమకల్లు గ్రామస్తులు కేపీసీఎల్‌ పవర్‌ ప్లాంట్‌ ఎదుట శనివారం ఆందోళన చేశారు. ప్లాంట్‌ యజమాన్యం నిర్లక్ష్యంతోనే బసవరాజు మృతి చెందాడని, నష్టపరిహారం కింద రూ.కోటిచెల్లించాలని ఆందోళన చేశారు. కాగా, రూ.50 లక్షల పరిహారం చెల్లింపునకు కంపెనీ యజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. అంత్యక్రియలకు రూ.లక్ష ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement