గుంతకల్లుటౌన్: క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఎస్కేయూ స్పోర్ట్స్ సెక్రెటరీ ఎంవీ శ్రీనివాసన్, ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య సూచించారు. స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఎస్కేయూ గ్రూప్–సీ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. వాలీబాల్ ఫైనల్ పోటీల్లో ఆర్ట్స్ కాలేజీ (అనంతపురం) జట్టుపై మంగళకర డిగ్రీ కళాశాల(జగరాజుపల్లి– శ్రీసత్యసాయిజిల్లా) జట్టు విజయం సాధించింది. చదరంగం పోటీల్లో ఎస్కేయూ జట్టుపై ఎస్వీ డిగ్రీ కాలేజీ (అనంతపురం) జట్టు గెలుపొందింది. సాఫ్ట్బాల్ ఫైనల్స్లో ఆర్ట్స్ కళాశాల జట్టుపై ఎస్ఎస్బీఎన్(అనంతపురం) కళాశాల జట్టు విజయం సాధించింది. ఇక ఖోఖో పోటీల్లో గుంతకల్లు ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


