అనంతపురం ఎడ్యుకేషన్: శాసీ్త్రయ భారతదేశ నిర్మాణం కోసం విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కె.చిత్తప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రంపై ఆసక్తి పెంచుకుని శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. అశాసీ్త్రయ భావజాలం వైపు, వాటిని ప్రచారం చేసే వారి వైపు ఆకర్షితులు కాకుండా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించడం అలవాటు చేసుకోవడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ పి.ప్రసూన తెలిపారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.వంశీకృష్ణ అన్నారు. జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లావ్యాప్తంగా ముగ్గురు విద్యార్థులతో కూడిన 42 బృందాలు పాల్గొన్నాయని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి ప్రశ్నపత్రాలను డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీరాములు నాయక్, అధ్యాపకుడు బి.గోపాల్ నాయక్, జేవీవీ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్, జిల్లా నాయకులు మహమ్మద్ జిలాన్, కె.లక్ష్మీనారాయణ, ఎస్.గాంగే నాయక్, ఎస్.తిరుపాల్, నాగరాజుస్వామి పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి


