ఆశలపై నీళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందాలి

పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లి, ముప్పాలగుత్తి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు, బుర్నాకుంట, మేడిమాకులపల్లి తదితర గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పారాయి. పొలాల్లోకి కూడా వర్షపునీరు చేరడంతో పత్తి, ఉద్దులు, పెసర తదితర పంటలు కుళ్లిపోయాయి. పత్తి కాయలు నేలరాలాయి. ఎకరాకు క్వింటా అయినా దిగుబడి వస్తుందని అనుకుంటే ఈ వర్షంతో పంట తుడిచిపెట్టుకుపోయిందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

తాడిపత్రి రూరల్‌/ గుత్తి : రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు అందరికీ అందాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్‌ తెలిపారు. జిల్లాలోని తాడిపత్రి, గుత్తిలో ఏర్పాటు చేసిన అదనపు కోర్టులను ఆదివారం ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయా కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్‌ భానుమతి, కె.సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్‌ రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన రక్షణలో అందరికీ సమానంగా అందే బాధ్యతను న్యాయ వ్యవస్థ చూడాలన్నారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో కొత్తగా 17 అదనపు కోర్టులు మంజూరయ్యాయని తెలిపారు. తాడిపత్రి, గుత్తిలో అదనపు కోర్టులను ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు నూతన కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన జడ్జి భానుమతి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు కె.సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్‌ మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలు, ఆశ్రయ గృహాల్లోని పిల్లలు, ఇతరులకు అవసరమైన రక్షణ, సంక్షేమ సేవలు అందేలా న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభాధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందించేందుకు ఆయా కోర్టులు పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్‌, అనంతపురం ఏడీజే జడ్జి సత్యవాణి, గుత్తి అదనపు జిల్లా జడ్జి శంకర్‌రావు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కాశీవిశ్వనాథ్‌, అనంతపురం ఎకై ్సజ్‌ కోర్టు జడ్జి పావని, తాడిపత్రి జూనియర్‌ సివిల్‌ జడ్జి అనిల్‌కుమార్‌నాయక్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్వేత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి, ఏపీపీ పరమేశ్వర్‌రెడ్డి, ఏజీపీ ఫకృబాషా, తాడిపత్రి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి ఏవీ రమణారెడ్డి, సాహుల్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement