ఆంక్షలు అధిగమించి ఆందోళనకు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు అధిగమించి ఆందోళనకు

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం సచివాలయ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల ద్వారా విశ్వప్రయత్నాలు చేసింది. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఆంక్షలు విధించింది. అయినా జిల్లా నుంచి సచివాలయ ఉద్యోగులు ఆంక్షలను.. అడ్డంకులను అధిగమించి విజయవాడ ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ఇందు కోసం పోలీసుల కంట పడకుండా ఉండేందుకు వివిధ రకాల వేషధారణల్లో బయల్దేరారు. ధర్నా చౌక్‌కు చేరుకుని తమ నిరసన గళం విప్పారు.

ఉద్యమాన్ని ఆపలేరు

అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్న ఉద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. తమను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తిప్పుతూ నరకం చూపించారని ఉద్యోగులు మీడియా ఎదుట వాపోయారు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచి హీనంగా చూశారని తెలిపారు. న్యాయమైన హక్కుల కోసం పోరాడితే పోలీసులను అడ్డుపెట్టి వేధింపులకు గురిచేయడం ఏంటని నిలదీశారు. ఉద్యమాన్ని ఎంత అణచాలని చూస్తే ఉవ్వెత్తున ఎగసి పడుతుందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదే లేదని భీష్మించారు.

ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిన సచివాలయ ఉద్యోగులు

ప్రభుత్వ వైఖరిపై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement