విచారణకే పరిమితమా? | - | Sakshi
Sakshi News home page

విచారణకే పరిమితమా?

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

● సొసైటీ చైర్మన్‌కు

ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అండదండలు

● రూ.30 లక్షల గోల్‌మాల్‌పై చర్యలు నిల్‌

నార్పల: మండల కేంద్రంలోని నార్పల రైతు సేవా సహకార సంఘం (సొసైటీ)లో రూ.30 లక్షల గోల్‌మాల్‌ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల విచారణ సమయంలో సొసైటీ ఇన్‌చార్జ్‌ సీఈఓ తారక బ్రహ్మానందరెడ్డి పొంతనలేని సమధానాలు చెప్పడం, చైర్మన్‌ ఉమా మహేశ్వరనాయుడు అందుబాటులో లేకపోవడం.. వచ్చిన తర్వాత కూడా వివరణ ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, ఫిర్యాదులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సభ్యులు చెబుతున్నారు. అయితే విచారణలు, తనిఖీలు, నివేదికల పేరుతో ప్రక్రియ సాగుతున్నప్పటికీ తుది చర్యలు ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం రూ.3.85 లక్షలు, మరొక రోజు రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు సమాచారం . అయితే మొత్తం బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో సభ్యుల్లో ఆందోళన కొనసాగుతోంది. కొంత కొంత మొత్తాన్ని జమ చేయడం వల్ల అసలు వ్యవహారంపై స్పష్టత రాదని, పూర్తి లెక్కలు బయటపెట్టాలని సభ్యులు కోరుతున్నారు.

ఆరోపణలొస్తే నోరు మెదపరా?

రైతు పక్షపాతిగా ఉంటామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తరచూ చెబుతుంటారు. అయితే రైతులకు సంబంధించిన సహకార సంఘంలో రూ.30 లక్షల మేర ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నా నోరు మెదపడం లేదు. సొసైటీ చైర్మన్‌ ఉమామహేశ్వరనాయుడు తన అనుచరుడు కావడం వల్లనే ఈ వ్యవహరంపై ఎమ్మెల్యే స్పందించడం లేదని, సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement