ఉరవకొండకు చెందిన కొమ్మసాని మహేష్, కొమ్మసాని పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. మహేష్ టైలర్ వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. కూతుళ్లు చిన్నప్పటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవారు. వారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సాహమందించారు. పెద్ద కుమార్తె దివ్య 2018లో డీఎస్సీ పరీక్షలు రాసి అర్హత సాధించడంతో 2020లో టీచర్‌గా ఎంపికై ంది. రెండో కుమార్తె ప్రభావతి 2020 సంవత్సరంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కొలువు సాధించింది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి.. వారి ఆశలను తమ ఆశయాలుగా మలచుకుని ఉద్యోగాలు సాధించామని దివ్య, ప్రభావతి తెలిపారు. అక్కల స్ఫూర్తితో తమ్ముడు రాహుల్ ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించడం గమనార్హం.


