అనంతపురం: అఖిల భారత అంతర వర్సిటీ, దక్షిణ భారత అంతర వర్సిటీ క్రీడా పోటీల్లో జేఎన్‌టీయూ అనంతపురం విద్యార్థులు రాణించేలా తర్పీదు ఇవ్వాలని వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అన్నారు. జేఎన్‌టీయూఏలో 17వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశాన్ని స్పోర్ట్స్ సెక్రెటర్ డాక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2025–26 సంవత్సరానికి సంబంధించిన క్రీడా వివరాలను వెల్లడించడంతో పాటు, 2026–27 విద్యాసంవత్సరంలో క్రీడల నిర్వహణ బాధ్యతలను వివిధ కళాశాలలకు కేటాయించే అంశాలపై కౌన్సిల్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ భవాని, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బా రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నా రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు జోజిరెడ్డి, దామోదర్ రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ బి. వెంకటశివారెడ్డి పాల్గొన్నారు.
65 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి ప్రతిభ
జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. జోజి రెడ్డి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. కొత్తగూడెం (పాల్వంచ)లో సెప్టెంబర్ 18 నుండి 22 వరకు నిర్వహించిన ’ఆలిండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్’లో 65 ఏళ్లకు పైబడిన వారి విభాగంలో ఆయన రన్నరప్ (ద్వితీయ స్థానం) సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఘనత సాధించిన జోజి రెడ్డిని వీసీ ప్రొఫెసర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్, ప్రొఫెసర్ దేవన్న, స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ నారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య దిలీప్ కుమార్, డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.


