తాగునీటి కష్టాలు పునరావృతం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కష్టాలు పునరావృతం

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

రాయదుర్గంటౌన్‌: పట్టణంలో తాగునీటి సరఫరా మరోసారి అస్తవ్యస్తంగా మారింది. అనేక కాలనీల్లో నాలుగైదు రోజులు గడిచిపోతున్నా.. తాగునీరు అందడం లేదు. హెచ్చెల్సీ నుంచి కణేకల్లులోని ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి తుంగభద్ర జలాల పంపింగ్‌ ఆశాజనకంగా జరుగుతోంది. దాదాపు రోజుకు 60 ఎంఎల్‌డీల నీరు పంపింగ్‌ చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ ట్యాంకు పూర్తిస్థాయి నీటిమట్టం 3,052 మిలియన్‌ లీటర్లు కాగా సోమవారం నాటికి 2,010 ఎంఎల్‌డీ నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి అధికారులు పట్టణవాసులకు తాగునీటిని సరఫరా చేయడంలో మళ్లీ పాత కథను పునరావతం చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ వర్షాలు లేవు, గాలి తీవ్రత లేదు, అయినప్పటికి కరెంట్‌ సరఫరాలో లోపం, టెక్నికల్‌ సమస్య, పైప్‌లైన్‌ లీకేజీ, వాల్వ్‌ లీకేజీ మరమ్మతు, పంప్‌హౌస్‌లో సమస్య, ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద మోటారు సమస్య అంటూ అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది చెబుతున్న పరిస్థితి ఉంది.

రెండు ట్యాంకర్లే గతి

ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీటి నిల్వ పూర్తిగా అడుగంటిన సమయంలో దాదాపు ఏడు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఐదు అద్దె ట్యాంకర్లను రద్దు చేసి కేవలం మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్ల ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి కొరత ఏర్పడిన సమయాల్లో రెండు ట్యాంకర్ల ద్వారా పట్టణంలో అవసరమైన చోట్ల నీటి సరఫరాకు ఎలా సాధ్యమవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలకులు కూడా తాగునీటి సరఫరా వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొళాయిలకు తాగునీరు సరఫరా కాని అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయం లేని కాలనీల్లో కనీస అవసరాలకు కూడా నీరు లభించని దుస్థితి ఉంది.

నాలుగైదు రోజులకోసారి

సరఫరాతో జనం పరేషాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement