ఉమ్మడి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

శింగనమల: ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం శింగనమలలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం ప్రకటించింది. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ వామపక్షాలు మూడు రోజులు పాటు చేస్తున్న ధర్నాకు వైఎస్సార్‌సీపీ మద్దతునిస్తుందన్నారు. తాము ఎక్కడ రాజకీయాలు చేయడం లేదని, తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే, పరిశీలించి భరోసా అందించామన్నారు. అధికార పార్టీ మాత్రం విమర్శలే ధ్యేయంగా ఉందన్నారు. రైతులకు న్యాయం చేస్తే హర్షిస్తామన్నారు. రైతులను ఆదుకోని పక్షంలో గట్టిగా పోరాటం చేస్తామన్నారు. రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, విద్యార్థుల ఫీజులు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వంకు ముందు చూపు లేదన్నారు. శాస్త్రవేత్తలు ఎల్‌నినో గురించి ముందస్తు సమాచారం అందించినా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్లే, నేడు పంటలు ఎండిపోయే స్థితి వచ్చిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7 లక్షల వరకు అందించారన్నారు. నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెన్నప్ప, మధు, చికెన్‌ బాషా, వైఎస్సార్‌సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, మధు, దుద్దేకుంట భాస్కర్‌రెడ్డి, నీలం భాస్కర్‌, ఎన్‌వి నారాయణ, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement