గార్లదిన్నె: రైతులు తడి, పొడి పద్ధతిలో వరి పంట సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు, కనంపల్లిలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల వల్ల వరి పంట సాగు చేయవద్దన్నారు. బీడు భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. రైతులు ఫారం పాండ్స్ నిర్మించుకుని వర్షపు నీటి వృథాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్ కుమార్, టెక్నికల్ ఏఓ రాకేష్, ఏఓ సోమశేఖర్, హెచ్‌ఓ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.


