కణేకల్లు: ప్రేమకు లింగభేదాలు కూడా అడ్డురావని నిరూపించారు జాను, వంశీ. ట్రాన్స్‌జెండర్‌ను యువకుడు పెళ్లిచేసుకోవడంతో కణేకల్లులోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కణేకల్లుకు చెందిన ట్రాన్స్‌జెండర్ జానుతో డీ.హీరేహళ్ మండలం గొడిసెలపల్లికి చెందిన వంశీకి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్లు ఇద్దరూ ప్రేమించుకొన్నారు. ప్రేమించిన జానుతో జీవితాంతం కలిసి ఉండి ఆమె జీవితంలో వెలుగులు నింపాలని నిర్ణయించుకొన్నాడు వంశీ. కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని జానుకూ చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. దీంతో బుధవారం కణేకల్లు బస్టాండ్‌లోని నాగులకట్ట వద్ద మనసా, వాచా, కర్మణా అంటూ జానూ మెడలో వంశీ మూడు ముళ్లూ వేశాడు. సహచర ట్రాన్స్ జెండర్లు దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. తమ జానుకు పెళ్లికావడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
దగ్గరుండి వివాహం జరిపించిన ట్రాన్స్‌జెండర్లు


