ప్రజల అవసరాలకు సంబంధించిన తాగునీటి పథకం నిర్వహణకు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. దీంతో కార్మికులకు ఉద్యోగ భద్రత, రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట పడుతుంది. తొలగించిన 23 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పూర్తి వేతనాలు, పీఎఫ్ చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులకు న్యాయం జరిగే వరకు సీఐటీయూ పోరాటం కొనసాగిస్తుంది.
–ఎస్.నాగేంద్రకుమార్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి


