● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం
రాప్తాడు రూరల్: డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. మంగళవారం హంపాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాను పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే రాప్తాడు నియోజకవర్గంలో మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 7 గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను చులకనగా చూస్తున్నారు
విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్ కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కష్టాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సత్తిరెడ్డి, గద్దె కేశవరెడ్డి, మండల కన్వీనరు సాకే వెంకటేశు, మాజీ కన్వీనరు శేఖర్, యూత్ కన్వీనరు విశ్వనాథరెడ్డి, హంపాపురం సింగారప్ప, చుక్కా సంజీవరాయుడు, రామినేపల్లి మాధవరెడ్డి, మన్నల రవికుమార్, రాప్తాడు చిరుతల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


