విడపనకల్లు: మండల పరిధిలోని గడేకల్లు గ్రామంలో మంగళవారం బాలాజీ ఫర్టిలైజర్ షాపుతో పాటు కోరమాండల్, మన గ్రోమోర్ సెంటర్లను అధికారులు తనిఖీ చేశారు. అనుమతి లేని పురుగుల మందులను విక్రయిస్తున్న సాయి బాలాజీ ఫర్టిలైజర్ షాపులో రూ.9,300, కోరమాండల్ షాపులో 40 లీటర్ల పురుగుల మందును సీజ్ చేశారు. రూ.1.3 లక్షల విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం, ఉరవకొండ ఏడీఏలు విద్యావతి, సత్యనారాయణ, వ్యవసాయాధికారి పెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.


