హనుమ ఆలయాలు కిటకిట | - | Sakshi
Sakshi News home page

హనుమ ఆలయాలు కిటకిట

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

గుంతకల్లు రూరల్‌:శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారు ఒంటె వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహించారు.

బొమ్మనహాళ్‌: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాసం చివరి నాల్గో మంగళవారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌స్వామి, పవన్‌స్వామి ఆధ్వర్యంలో ఆలయాల్లో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తుల కోసం దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌ ఎస్‌ఐలు నబీరసూల్‌, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అలంకరణలో నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి వార్లు

నేమకల్లులో దర్శనం కోసం క్యూకట్టిన భక్తులు

మురడిలో భక్తుల రద్దీ

ఒంటె వాహనంపై విహరిస్తున్న నెట్టికంటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement