చెరువు మట్టి తరలింపుపై తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

చెరువు మట్టి తరలింపుపై తిరుగుబాటు

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

డి.హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌): చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుండడంపై దొడగట్ట గ్రామస్తులు ఆగ్రహించారు. గ్రామానికి చెందిన అధికార టీడీపీ నాయకుడు ఇరిగేషన్‌ అధికారులతో లోపాయికారిగా మాట్లాడుకుని దొడగట్ట చెరువులో జేసీబీలను పెట్టి ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారు. రైతుల పొలాలకు మట్టి తోలుతామని చెప్పి వందలాది టిప్పర్ల మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మట్టి తవ్వుకున్నందుకు కొంత మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఇస్తామని చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి.. సొమ్మంతా టీడీపీ నాయకుడు జేబులో వేసుకోవడంతో రైతులు, గ్రామస్తులు ఆగ్రహించారు. శుక్రవారం చెరువులోనుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. సారవంతమైన మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యంతరం తెలిపారు. దీంతో మట్టి తరలింపు తాత్కాలికంగా నిలిచిపోయింది.

రైతుల పొలాలకని మట్టి తవ్వకాలు

కర్ణాటకలో అమ్మి సొమ్ము చేసుకున్న ‘పచ్చ’ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement