కుందుర్పి: శెట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి కుందుర్పి ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడానికి భర్త కానిస్టేబుల్ బొమ్మలింగ సహకారంతో ఈ ఏడాది వేసవిలో ఓ ఆటోకు మైక్ ఏర్పాటు చేసుకొని ‘బడికి పోదాం రా’ నినాదంతో అవగాహన కల్పించారు. మండలంలోని 36 గ్రామాలు తిరిగి 180 మంది డ్రాపౌట్స్‌ను తిరిగి బడిలో చేర్పించారు. దీంతో ఇద్దరు ఉండాల్సిన బడిలో ఆరుగురు టీచర్లు ఉండేందుకు కృషి చేశారు. ఎస్సీ కాలనీ పాఠశాలకు సొంత ఖర్చులతో వర్ణమాలతో పాటు 6 గదులకు పెయింటింగ్‌తో పాటు గదుల పునరుద్ధరణ పనులు చేసి ప్రజల నుంచి మన్ననలు అందుకున్నారు. పాఠశాలకు కంప్యూటర్లు, మైక్‌సెట్ వితరణ చేశారు. టీచర్ వరలక్ష్మి సేవలకు ఉత్తమ అవార్డు వరించింది.


