కణేకల్లు: విద్యార్థుల ప్రతిభను వెలికి తీయించడంలో రాజశేఖర్‌కు ఎవ్వరూ సాటిలేరు. కణేకల్లు మండలం యర్రగుంట జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎంగా పని చేస్తున్న రాజశేఖర్‌కు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఎక్కడ పని చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యర్రగుంటకు ముందు పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కలూరు జెడ్పీ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ లేకపోవడంతో తానే పాఠాలు బోధించి.. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణకు కృషి చేశారు. యర్రగుంట జెడ్పీహైస్కూల్ హెచ్‌ఎంగా ఏడాది క్రితం వచ్చారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తపించారు. అలా ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్ పరీక్షలు రాయించగా.. నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. మాక్ అసెంబ్లీకి ఒక విద్యార్థిని ఎంపికయ్యింది.


