అనంతపురం టౌన్: విద్యుత్ శాఖలో డిప్యుటేషన్లు రద్దు చేయడంతోపాటు ఎలాంటి బదిలీలు చేయకూడదని జూన్ నెలలో ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యుటేషనపై వివిధ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులు యథా స్థానాలకు వెళ్లాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు ఉద్యోగులు మాతృస్థానాలకు వెళ్లి విధులు నిర్వహిస్తుంటే.. మరికొందరు ఉద్యోగులు ఎస్‌ఈ ఉత్తర్వులు తమకు పట్టవన్నట్లు ఇక్కడే తిష్ట వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తర్వులు కొందరికేనా?
విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు డిప్యుటేషన్లు, మరి కొందరు వర్కింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ పేరిట ప్రత్యేక ఉత్తర్వులతో ఇక్కడే తిష్ట వేసుకున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ జూన్ నెలలో ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తమ మాతృ స్థానాల్లో జాయిన్ కావాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. దీంతో కొందరు ఉద్యోగులు వారి యథాస్థానాలకు వెళ్లిపోగా, చాలా మంది ఉద్యోగులు ఇక్కడే ఉండిపోయారు. ఎస్‌ఈ ఉత్తర్వులు కొందరికేనా? అంటూ ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. పలుకుబడి ఉన్నవారిని, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే వారిని ఎక్కడైనా కొనసాగిస్తారని వాపోతున్నారు. విద్యుత్ శాఖలో ఈఆర్‌ఓ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉద్యోగులు తమ మాతృ స్థానాలకు వెళ్లకుండా సర్కిల్ కార్యాలయం, రూరల్, అర్బన్ ఈఆర్‌ఓ కార్యాలయాల్లోనే ఉండిపోవడంపై మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎస్‌ఈ ఉత్తర్వులను 100శాతం అమలు చేయాలని కోరుతున్నారు.
తిష్టవేసిన విద్యుత్ ఉద్యోగులు
డిప్యుటేషన్లు రద్దు చేసినా
కదలని వైనం
ఎస్‌ఈ ఉత్తర్వులు
కొందరికేనా అంటూ నిట్టూర్పు
యథాస్థానాలకు వెళ్లాల్సిందే
విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొందరు డిప్యుటేషన్లు, మరి కొందరు వర్కింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ పేరిట ప్రత్యేక ఉత్తర్వులతో ఇక్కడే తిష్ట వేసుకున్నారు. ఎవరికీ మినహాయింపు ఉండదు. అందరూ తమ యథాస్థానాలకు వెళ్లాల్సిందే. దీనిపై మరో మారు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – శేషాద్రిశేఖర్, ఎస్‌ఈ


