అనంతపురం సెంట్రల్: లిఫ్ట్ కూలి సెంట్రింగ్ వర్కర్ దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు... హమాలికాలనీకి చెందిన శివకుమార్ (43) అతని కుమారుడు గౌతమ్ రాంనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. బుధవారం పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు లిఫ్టు కూలి కింద పడడంతో శివకుమార్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కుమారుడు గౌతమ్‌కు గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు భార్య మునేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ ఏపీ మస్తాన్, ఎస్‌ఐ గోపి తెలిపారు.


