మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా అమలు కావాలంటే కేవలం మెనూను నిర్ణయించడం, ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని అమలు చేసే కార్మికులు, ఏజెన్సీల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలు, డైట్ చార్జీల బిల్లులను తక్షణమే విడుదల చేయడంతో పాటు, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను పెంచాలి.
– ఎం. నాగమణి, జిల్లా ప్రధాన
కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్


