ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన మల్లికార్జున అనే రైతు ఏడు ఎకరాల్లో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేశాడు. రెండు నెలలుగా సరైన వర్షాలు లేవు. దీనికి తోడు గ్రామంలోని చెరువులోనూ నీరు లేదు. దీంతో ఉన్న బోరుబావుల్లో నీరు అడుగంటిపోయింది. నీరందకపోవడంతో పంట మొత్తం ఎండిపోతోంది. కనీసం పశువుల మేతకై నా ఉపయోగపడుతుదనే ఉద్దేశంతో పంటను ఎద్దులతో గుంటకపాశాడు. ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టిన రూ.3లక్షలూ నష్టపోయామని, తమ కష్టం మట్టిలో కలిసిపోయిందని రైతు కన్నీరుమున్నీరయ్యారు.
– ఉరవకొండ:


