ఇంకెన్నాళ్లీ దుశ్శాసన పర్వం..? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ దుశ్శాసన పర్వం..?

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

మహిళలపై వరుస దాడులకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలి

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ధ్వజం

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దుశ్శాసన పర్వం నడుస్తోందని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు మండిపడ్డారు. విభాగం జిల్లా అధ్యక్షురాలు బి. శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ నగర వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీదేవి మాట్లాడుతూ గుంటూరులో మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేయడం, బద్వేలులో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు ఓ వృద్ధ మహిళపై కిరాతకంగా దాడి చేసిన ఘటనలను చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంటోందన్నారు. హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, గల్లా మాధవి వీటిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వైఎస్సార్‌ సీపీ పోరాడుతుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌కు ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రత అంశంలో పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి అవమానించినా, ఆడబిడ్డలు అదృశ్యమవుతున్నా స్పందించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మహిళలపై నేరాలకు పాల్పడాలంటే నేరస్తులు భయపడేలా చట్టాలు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో దుశ్శాసన పర్వం నడుస్తోందని విమర్శించారు. గుంటూరులో ఒక బీసీ మహిళను వివస్త్రను చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ లేవన్నారు. రెడ్‌బుక్‌ స్టార్‌ నారా లోకేష్‌ కనుసన్నల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. మాజీ మేయర్‌ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను చూసి మహిళలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, మొఘల్‌ సైఫుల్లా భేగ్‌, మల్లెమీద నరసింహులు, రాధా యాదవ్‌, పేరం స్వర్ణలత, వసంత, మౌలీశ్వరి, బోయ సుశీలమ్మ, నాగలక్ష్మి, పార్వతి, ఉషారాణి, ఎద్దుల అమర్‌నాథ రెడ్డి, జానీ, ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ శంకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, నాగార్జున రెడ్డి, కైలాష్‌, సంపంగి రామాంజినేయులు, అనిల్‌ కుమార్‌ గౌడ్‌, ఇషాక్‌, సాకే కుళ్లాయిస్వామి, సతీష్‌, శ్రీనివాసులు, గుణశేఖర్‌ బాబు, శ్రీనివాస రెడ్డి, షేక్‌ ఖాజా, రమణా రెడ్డి, లబ్బే రాఘవ, థామస్‌, సాకే అశోక్‌ కుమార్‌, కిషోర్‌, మహిళా విభాగం నాయకురాళ్లు దేశాయి భారతి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, పార్వతి, చంద్రలేఖ, ఉషా, అంజలి, సుశీల, పద్మావతి, జాహ్నవి, దేవి, సుజాత, సుహాసిని, శోభారాణి, పద్మావతి, పార్వతి, అంజలి, ప్రసన్న, చంద్రకళ, మహేశ్వరి, అనూరాధ, లీల, హజరాబీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement