‘తమ్ముళ్ల’ పైశాచికం | - | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’ పైశాచికం

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

విడపనకల్లు: ‘పచ్చ’ మూకలు పైశాచికం ప్రద ర్శించారు. వ్యవసాయ పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా మూడు బోర్లు ధ్వంసం చేశారు. బాధితుడి వివరాల మేరకు.. విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ సర్వే నంబర్‌ 141లో 21.50 ఎకరాల భూమిని వైఎస్సార్‌ సీపీ నాయకుడు కురుబ గోవిందు అల్లుడు జయకుమార్‌ 2023 జూన్‌లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అదే ఏడాది రూ.5 లక్షలు ఖర్చు చేసి పొలంలో ఐదు బోర్లు వేయించగా.. మూడు బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. పొలంలోకి ఈ నెల 19న ఆదివారం జనార్దనపల్లికి చెందిన టీడీపీ నాయకులు సుధాకర్‌ నాయుడు, ముప్పారపు పాండురంగ నాయుడు, మాజీ సర్పంచు రాయంటి జనార్దన నాయుడు అక్రమంగా ప్రవేశించి మూడు బోర్లను ధ్వంసం చేశారు. కేసింగ్‌ పైపులు ఎత్తుకెళ్లారు. పైశాచికంగా బోర్లలోకి పెద్ద పెద్ద రాళ్లు వేశారు. బాధితులు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు విడపనకల్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఎస్‌ఐ ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో మంగళవారం ఉరవకొండ రూరల్‌ సీఐ మహానందిని ఆశ్రయించారు. స్థానికంగా తమకు న్యాయం జరగకపోతే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని గోవిందు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement