అనంతపురం అగ్రికల్చర్: ఈనెలాఖరులోపు ప్రీమియం చెల్లించి వాతావరణ, ఫసల్ బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పంట సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో తప్పకుండా నమోదు కావాలన్నారు. సాగు చేసిన పంటకే ప్రీమియం కట్టాలన్నారు. వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, అరటి, టమాట, కంది, జొన్న, ఆముదం, మొక్కజొన్న, ఎండుమిరప రైతులకు బీమా పథకాలు వర్తిస్తాయన్నారు. వరి రైతులు ఆగస్టు 15 లోపు ప్రీమియం చెల్లించాలన్నారు.
వెనక్కి రాని ఈఎఫ్‌లు 2.10 లక్షలు
అనంతపురం అర్బన్: వెనక్కిరాని ఈఎఫ్‌ల సంఖ్య 2,10, 933కు చేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) గడువు 10 రోజులు పొడిగించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్‌ఓలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వెనక్కిరాని ఈఎఫ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 14 నాటికి వెనక్కిరాని ఈఎఫ్‌ల సంఖ్య 2,08,791 ఉండింది. 15 నాటికి 351 పెరిగి వాటి సంఖ్య 2,09,151కి చేరింది. ఇక శుక్రవారం నాటికి వెనక్కిరాని ఈఎఫ్‌ల మరో 1,782 పెరిగి 2,10,933కు చేరింది. వీరందరికీ ఓటు హక్కు ఉండదు.


