ప్రభుత్వ చర్యలను ఎండగడదాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ చర్యలను ఎండగడదాం

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

అనంతపురం న్యూటౌన్‌: ‘చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సోషల్‌ మీడియా ప్రతినిధులను వేధిస్తోంది. జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండాలనే సదుద్దేశంతో ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఏర్పాటు చేశారన్నారు. పార్టీ శ్రేణులందరూ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ కార్యకర్తలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో సూపర్‌ యాప్‌ ఆవిష్కరణతో మరోసారి అందరికీ తెలిసిందన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, మాజీ మేయర్‌ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, నగరాధ్యక్షుడు చింతా సోమ శేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ బాబా సలామ్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుల్లా బేగ్‌, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్‌ గౌడ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌ పీరా, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కే.ఓబిరెడ్డి, ఎద్దుల అమర్‌నాథ్‌ రెడ్డి, సంపంగి రామాంజనేయులు, దేవీ, భారతి, హజరాంబీ, లీలా, భారతి రెడ్డి, కుళ్ళయప్ప, సాకే కుళ్లాయి స్వామి, కమల్‌ భూషణ్‌, గుణ శేఖర్‌ బాబు, దామోదర్‌ రెడ్డి, మల్లెల వేణు గోపాల్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వేధింపులు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్‌ చేసుకోండి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement