బెల్టుషాపులపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

బెల్టుషాపులపై చర్యలు తీసుకోండి

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

మాజీ మంత్రి సాకే శైలజనాథ్‌

శింగనమల: నియోజకవర్గంలోని మద్యం బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి , వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ ఎకై ్సజ్‌ ఎస్‌ఐని కోరారు. ఈ మేరకు గురువారం బుక్కరాయసముద్రంలోని ఎకై ్సజ్‌ కార్యాలయానికి వెళ్లి ఎస్‌ఐకి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలసినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో యువత, కూలీలు, పేద కుటుంబాలు అక్రమ మద్యం విక్రయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీటిపై ప్రత్యేక చర్యలు తీసుకొని బెల్టు షాపులను మూసి వేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎకై ్సజ్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కల్తీ మద్యం కారణంగా ఎంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. శింగనమలలో ఉదయం ఐదు గంటలకే మద్యం బెల్టు షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. మొన్ననే శింగనమలలో ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోయిందని, ఆడ బిడ్డలు అనాథలుగా మారారన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement