● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి
అనంతపరం న్యూటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చూపిన పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముద్రగడ రాజకీయ నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి మరువలేనిదన్నారు. శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై చేయని కుట్ర లేదని, అయినా తలొగ్గకుండా ప్రజా నాయకుడిగా పేరు గడించారన్నారు. ముద్రగడ మరణం కాపు ఉద్యమానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. మాజీ మంత్రి డాక్టర్ శైలజానాఽథ్ మాట్లాడుతూ ముద్రగడతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకు న్నారు. కాపులనే కాకుండా బడుగు వర్గాలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముద్రగడ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్, మాజీ మేయర్ వసీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర కార్యదర్శి వీరా రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజరి వెంకటేష్, నాయకులు వెంకటరాముడు, చింతకుంట అమర్నాథ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమ శేఖర్ రెడ్డి,అనుబంధ సంఘాల అధ్యక్షులు మొఘల్ సైపుల్లా బేగ్, గాజుల ఉమాపతి, చంద్ర శేఖర్ యాదవ్, శ్రీదేవి, మాలపాటి శ్రీనివాసులు, దాదాఖలందర్, టీవీ చంద్రమోహన్ రెడ్డి, కమల్ భూషణ్, కేశవరెడ్డి, గుణ శేఖర్, సాకే అశోక్ కుమార్, భారతి, మహేశ్వరి, దేవి, పార్వతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


